Tsunami | సునామీ భయం.. అమెరికాలోని భారత పౌరులకు ఇండియన్ కాన్సులేట్ కీలక సూచనలు!
Tsunami | రష్యా, జపాన్‌తో పాటు ఉత్తర పసిఫిక్‌లోని పలు తీరప్రాంతాలను సునామీ తాకిన నేపథ్యంలో అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ అప్రమత్తమైంది. అమెరికాలోని భారతీయులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Tsunami | రష్యా, జపాన్‌తో పాటు ఉత్తర పసిఫిక్‌లోని పలు తీరప్రాంతాలను సునామీ తాకిన నేపథ్యంలో అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ అప్రమత్తమైంది. అమెరికాలోని భారతీయులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
సునామీ ముప్పును శాన్‌ఫ్రాన్సిస్కోలని భారత కాన్సులేట్ జనరల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందని భారత కాన్సులెట్ జనరల్ తెలిపింది. కాలిఫోర్నియా, హవాయితో పాటు అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాల్లో నివసిస్తున్న భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అమెరికా అధికారులు జారీ చేసే అలర్ట్‌లను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని చెప్పింది. సునామీ హెచ్చరికలు జారీ చేస్తే వెంటనే ఎత్తయిన ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది.
తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని అమెరికాలోని భారత పౌరులకు భారత కాన్సులేట్ జనరల్ సూచించింది. ఎమర్జెన్సీ సిట్యూయేషన్స్కు సిద్ధంగా ఉండాలని.. మీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కు చార్జింగ్ ఉండేలా చూసుకోవాలని తెలిపింది. సాయం కోసం ఎమర్జెన్సీ నంబర్లను సంప్రదించాలని కోరింది.
🚨🚨🚨
The Consulate General of India in San Francisco is monitoring the potential tsunami threat following the recent 8.7 magnitude earthquake off Russia’s Kamchatka Peninsula. Indian nationals in California, other US West Coast states, and Hawaii are advised to take the…
— India in SF (@CGISFO) July 30, 2025
కాగా, రష్యా తూర్పు తీరంలోని కంచట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్‌స్క్‌క తూర్పు దిశగా 136 కిలోమీటర్ల దూరంలో మంగళవారం తెల్లవారుజామున భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత 8.0గా రిక్టర్ స్కేలుపై 8.7గా నమోదైంది. రష్యాలోని కురిల్ దీవులు, జపాన్‌లోని హొక్కైడో దీవులను సునామీ తాకింది. రాకాసి అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. కాగా, అమెరికా అలస్కా, హవాయి ద్వీపాలను కలుపుకుని పలు ప్రాంతాల్లో ఇప్పటికే సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్లంబర్ విమానాన్ని దించగలడా?
కశ్మీర్ బస్సులపై రెండ్రోజుల్లో రెండు దాడులు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

