Nikki Haley | నిక్కీ హేలీ ఖాతాలో మరో విజయం.. వెర్మోంట్ ప్రైమరీలో ట్రంప్‌పై గెలుపు
Nikki Haley | అమెరికాలో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం ఆశిస్తున్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ (Nikki Haley).. ప్రైమరీల్లో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
Nikki Haley | అమెరికాలో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం ఆశిస్తున్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ (Nikki Haley).. ప్రైమరీల్లో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మంగళవారం వెర్మోంట్ (Vermont) రాష్ట్రంలో జరిగిన రిపబ్లికన్ ప్రైమరీ (Republican Primary) ఎన్నికల్లో తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump)పై ఆమె గెలుపొందారు.
దీంతో ఇప్పటి వరకూ జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో హేలీకి ఇది రెండో విజయం. ఆదివారం జరిగిన వాషింగ్టన్ డీసీ (Washington DC) ప్రైమరీ ఎన్నికల్లో కూడా ట్రంప్‌పై హేలీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక సూపర్ ట్యూజ్‌డే (Super Tuesday) ప్రైమరీ ఎన్నికల్లో కూడా విజయం సాధించడం విశేషం.
రిపబ్లికన్ పార్టీ తరఫున దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం రావాలంటే, కనీసం 1,215 మంది డెలిగేట్ల మద్దతు అవసరం. అయితే, ఈ ప్రైమరీల్లో ట్రంప్ విజయ పరంపర కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు మద్దతు పలికే డెలిగేట్ల సంఖ్య 893గా ఉంది. నిక్కీ హేలీకి 66 మంది డెలిగేట్లు మాత్రమే మద్దతిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. సూపర్ ట్యూజ్‌డే (Super Tuesday) ప్రైమరీ ఎన్నికల్లో జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. ఆ ఇద్దరూ తమ పార్టీ ఓట్లను కొల్లకొట్టేస్తున్నారు. 15 రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో.. ఇద్దరూ స్వీప్ చేశారు. మరోసారి ఆ ఇద్దరి మధ్యే దేశాధ్యక్ష పదవికి పోటీ ఉండే ఛాన్సు ఉన్నట్లు తాజా ఫలితాల ద్వారా తెలుస్తోంది. తాజా రిపోర్టు ప్రకారం డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్.. సుమారు 14 రాష్ట్రాల్లో విజయం సాధించారు. ఐయోవాలో కూడా తమ పార్టీ తరపున ప్రైమరీ నెగ్గినట్లు తెలుస్తోంది. ఇక మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుమారు 12 రాష్ట్రాల్లో రిపబ్లికన్ నేతగా విజయం సాధించారు. దీంతో నిక్కీ హేలీకి ఆయన గట్టి పోటీగా మారారు. అయితే వెర్మోంట్ రాష్ట్రంలో మాత్రం అనూహ్యంగా నిక్కీ హేలీ ప్రైమరీ రేసులో గెలుపొందారు.
మంగళవారం జరిగే ప్రైమరీ ఎన్నికలను సూపర్ ట్యూజ్‌డే అంటారు. మార్చి 5వ తేదీన అమెరికాలోని 15 రాష్ట్రాల్లో ఆ ఎన్నికలు జరిగాయి. అమెరికా అధ్యక్ష అభ్యర్థి కోసం జరిగే ప్రైమరీ ఎన్నికల క్యాలెండర్లో ఓకే రోజు ఎక్కువ రాష్ట్రాల్లో ఓటింగ్ నిర్వహిస్తారు. దాన్నే సూపర్ ట్యూజ్‌డే అంటారు. అలబామా, అలస్కా, కాలిఫోర్నియా, కొలరాడో, మెయిన్, మసాచుసెట్స్, మిన్నసొట, నార్త్ కరోలినా, ఓక్లహామా, టెన్నిస్సీ, టెక్సాస్, ఉటాహ్, వెర్మోంట్, వర్జీనియా రాష్ట్రాల్లో ఓటింగ్ జరుగుతుంది.
Also Read..
Michelle Obama | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయట్లేదు : మిచెల్ ఒబామా
Lok Sabha | నేడు బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల..?
Red Sea | మరోసారి రెచ్చిపోయిన హౌతీలు.. రెడ్ సీలో రెండు యూఎస్ నౌకలపై దాడులు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

