Michelle Obama | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయట్లేదు : మిచెల్ ఒబామా
Michelle Obama | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (US presidential elections) పోటీ చేసే అంశంపై మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా (Michelle Obama) క్లారిటీ ఇచ్చారు.
Michelle Obama | ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (US presidential elections) మాజీ ప్రథమ మహిళ, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిచెల్ ఒబామా (Michelle Obama) పోటీ చేయబోతోందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై మాజీ ఫస్ట్ లేడీ మిచెల్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయట్లేదని స్పష్టం చేశారు.
ఈ మేరకు మాజీ ప్రథమ మహిళ (Former First Lady) కార్యాలయం స్పష్టతనిచ్చింది. మిచెల్ ఒబామా అధ్యక్ష పదవికి పోటీ చేయట్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మిచెల్ ఒబామాకు రాబోయే 2024 ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. అయితే, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఎన్నికల ప్రచారానికి మద్దతు ఇస్తారని వెల్లడించింది.
వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మిచెల్ ఒబామా పోటీ చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా యూఎస్ మీడియాలో వరుస కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. మాజీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పోటీగా బైడెన్ స్థానంలో ఒబామా బరిలోకి దిగనున్నారంటూ స్థానిక మీడియా పేర్కొంది. అదేవిధంగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కు డెమొక్రాట్ల నుంచి మద్దతు కరవైందని, బైడన్‌కు బదులుగా వారంతా మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామాను సమర్థిస్తున్నారని ఇటీవలే ఓ సర్వేలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో మిచెల్ కార్యాలయం ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చింది.
Also Read..
Janhvi kapoor | పుట్టినరోజునాడు తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న జాన్వీ కపూర్
Lok Sabha | నేడు బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల..?
DK Shivakumar | మా ఇంట్లో బోరు కూడా ఎండిపోయింది.. బెంగళూరు నీటి సంక్షోభంపై డీకే శివకుమార్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

