Elon Musk | టెక్సాస్, జనవరి 18: భారత్-అమెరికా మధ్య సంబంధాలు సానుకూలంగా ఉన్నాయని, వాటి మధ్య వాణిజ్య భాగస్వామ్యానికి తాను మద్దతు ఇస్తున్నానని బిలియనీర్ ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. భారత వ్యాపార ప్రతినిధులు ఆయనతో టెక్సాస్‌లో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా భారత్‌కు చెందిన ఓయో, ఫ్లిప్‌కార్ట్, ఆదిత్య బిర్లా సంస్థల అధిపతులతో మస్క్ మాట్లాడుతూ టెక్నాలజీ, అంతరిక్ష పరిశోధన రంగాలలో భారత్-అమెరికా చేపట్టాల్సిన లోతైన సహకారం గురించి నొక్కి చెప్పారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఆశాజనకంగా ఉన్నాయని, రెండింటి మధ్య వాణిజ్యాన్ని పెంచడానికి, అడ్డంకులను తొలగించడానికి తాను పూర్తి సహకారం అందిస్తానని హామీనిచ్చారు.