గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్ లో తగ్గిన ఇండియా ర్యాంక్…

డిల్లీ ,జూన్ 11: కరోనా ప్రభావం ఆ రంగం ,ఈ రంగం అనే తేడా లేకుండా అన్ని రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలు కోలుకోలేని దెబ్బతిన్నాయి. ఇళ్ల ధరలపై ప్రాపర్టీ అడ్వైజరీ నైట్ ఫ్రాంక్ సంస్థ అధ్యయనం చేసింది. భారతదేశంలో ఇంటి ధరలు గత ఏడాది మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో 1.6 శాతం మేర క్షీణించాయని ప్రాపర్టీ అడ్వైజరీ నైట్ ఫ్రాంక్ తన తాజా రీసెర్చ్ నివేదిక గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్-Q12021లో వెల్లడించింది. అంతర్జాతీయంగా కూడా భారత్ ర్యాంకు తగ్గింది. 2020 క్యాలెండర్ ఇయర్ Q1లో 43వ ర్యాంకులో ఉన్న భారత్ 2021 క్యాలెండర్ ఇయర్ Q1లో 12 స్థానాలు తగ్గి 55వ స్థానానికి పడిపోయింది. అయితే డిసెంబర్ త్రైమాసికం 56వ స్థానంతో పోలిస్తే మాత్రం కాస్త ముందుకు జరిగింది. మార్చి త్రైమాసికంలో ఒక స్థానం ముందుకు వచ్చింది.
జూలై-సెప్టెంబర్ 2020 త్రైమాసికంతో పోలిస్తే ఇళ్ల ధరల వృద్ధి 0.6 శాతం, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 1.4 శాతం వద్ధి నమోదు చేసింది. 56 దేశాలు టెర్రిటరీస్ ఇళ్ల ధరల సూచీలను గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్ పరిగణలోకి తీసుకుంది. Q1 2020 నుంచి Q1 2021 మధ్య టర్కీ అన్ని దేశాల కంటే ముదు ఉంది. టర్కీలో ఏడాది ప్రాతిపదికన 32 శాతం, న్యూజిలాండ్ 22.1 శాతం, లగ్జెంబర్గ్ 16.6 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఏడాది ప్రాతిపదికన 1.8 శాతం క్షీణతతో స్పెయిన్ చివరలో నిలిచింది. ఆ తర్వాత భారత్ 1.6 శాతం క్షీణతతో ఉంది. 2005 నుంచి అత్యధిక వార్షిక వృద్ధి అమెరికా నమోదు చేసింది. అగ్రరాజ్యంలో ఏడాది ప్రాతిపదికన 13.2 శాతం నమోదయింది. 56 దేశాలు, టెర్రిటరీల్లో సగటున 7.3 శాతం వృద్ధి నమోదయింది. ఏడాది ప్రాతిపదికన నాలుగు దేశాల్లో 7 శాతం క్షీణత నమోదయింది. అదే సమయంలో 13 దేశాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో డబుల్ డిజిట్ గ్రోత్ నమోదయింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

