యుద్ధంలో తలదూర్చం.. దాంతో మాకు సంబంధం లేదు
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో అమెరికా నుంచి కీలక ప్రకటన వెలువడింది. యుద్ధంలో తాము జోక్యం చేసుకోబోమని, ప్రాథమికంగా దాంతో తమకు ఎటువంటి సంబంధం లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గురువారం విస్పష్టంగా ప్రకటించారు.
- భారత్, పాక్‌లను కట్టడి చేయలేం
- అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
న్యూఢిల్లీ, మే 9: భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో అమెరికా నుంచి కీలక ప్రకటన వెలువడింది. యుద్ధంలో తాము జోక్యం చేసుకోబోమని, ప్రాథమికంగా దాంతో తమకు ఎటువంటి సంబంధం లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గురువారం విస్పష్టంగా ప్రకటించారు. ‘భారత్, పాకిస్థాన్‌ను అమెరికా కట్టడి చేయలేదు. ఉద్రిక్తతలను తగ్గించాలని మాత్రమే ఆ రెండు అణ్వస్త్ర దేశాలకు మేము సూచించగలం’ అని ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. భారత్, పాకిస్థాన్ మధ్య అణు యుద్ధం జరిగే అవకాశాలపై ట్రంప్ ప్రభుత్వం ఏ రకంగా ఆందోళన చెందుతోందన్న ప్రశ్నకు అణ్వస్ర్తాలు కలిగిన రెండు దేశాలు ఘర్షణకు దిగితే అది భారీ యుద్ధానికి దారితీయగలదన్న ఆందోళన ఉందని వాన్స్ చెప్పారు. సాధ్యమైనంత త్వరితంగా ఉద్రిక్తతలు తగ్గాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పిన మాటలను ఆయన ఉటంకించారు. భారత్‌కు పాకిస్థాన్‌తో విరోధం ఉందని, అందుకు పాక్ జవాబిచ్చిందని ఆయన చెప్పారు. ఈ సమయంలో ఉద్రిక్తతలను కాస్త తగ్గించుకోవాలని మాత్రమే తాము చెప్పగలమని ఆయన తెలిపారు.
భారతీయులకు చెప్పలేం
ఆయుధాలను పక్కనపెట్టమని భారతీయులకు అమెరికా చెప్పలేదని వాన్స్ తెలిపారు. పాకిస్థాన్‌కు కూడా ఆయుధాలు పక్కనపెట్టాలని తాము చెప్పలేమన్నారు. ఈ విషయాన్ని దౌత్యపరమైన మార్గాల ద్వారా మాత్రమే తాము కొనసాగిస్తామని ఆయన అన్నారు.‘ ఇది విస్తృతమై ప్రాంతీయ యుద్ధానికి లేదా అణు యుద్ధానికి దారితీయకూడదని మాత్రమే మేము ఆశిస్తున్నాము, అంచనా వేస్తున్నాము’ అని వాన్స్ తెలిపారు. అణుయుద్ధం జరిగితే అది వినాశనానికి దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. ఆ పరిస్థితి వస్తుందని ప్రస్తుతానికైతే తాము భావించడం లేదని వాన్స్ అభిప్రాయపడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

