ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆపాలని ఐరాసా తీర్మానం.. ఓటింగ్‌కు భారత్ దూరం
UNGA | ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆపాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసింది. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని సమర్ధిస్తూ చేసిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం (UNGA) ఆమోదించింది.
న్యూయార్క్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆపాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసింది. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని సమర్ధిస్తూ చేసిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం (UNGA) ఆమోదించింది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, అఫ్గానిస్థాన్, ఐర్లాండ్ సహా 141 సభ్య దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటువేశాయి. దీనిని నాలుగు దేశాలు వ్యతిరేకించాయి. అయితే ఉక్రెయిన్ విషయంలో ఐరాసలో జరిగిన ఓటింగ్‌కు భారత్ మరోసారి దూరంగా ఉన్నది.
రష్యాకు వ్యతిరేకంగా నిర్వహించిన ఈ ఓటింగ్‌కు భారత్ సహా 35 దేశాలు పూర్తిగా దూరంగా ఉన్నాయి. కాగా, మెజార్టీ దేశాలు అనుకూలంగా ఓటువేయడంతో తీర్మానం ఆమోదం పొందినట్లు ఐరాస జనరల్ అసెంబ్లీ ప్రకటించింది. ఉక్రెయిన్‌పై యుద్ధంలో అణ్వాయుధాలను సిద్ధం చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. యుద్ధాన్ని విరమించి ఇరుదేశాల మధ్య శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చేయాలని సూచించింది.
ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై భారత్ మొదటి నుంచే తటస్థంగా వ్యవహరిస్తున్నది. ఇరుపక్షాలు శాంతియుత మార్గంలో, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచిస్తున్నది. అయితే ఐక్యరాజ్యసమితిలో రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు దూరంగా ఉంటూ వస్తున్నది. ఇటీవల ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన రెండు తీర్మానాలపై ఓటింగ్‌కు భారత్ గౌర్హాజరైన విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- India
- resolution
- Russia
- Ukraine
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

