Pakistan Elections | ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో జరుగుతున్న ఎన్నికల్లో మూడుసార్లు పాక్ ప్రధానిగా పనిచేసిన నవాజ్‌షరీఫ్ పార్టీ అభ్యర్థులు గట్టిపోటీని ఎదుర్కొన్నారు. మరీ ముఖ్యంగా కీలకమైన పంజాబ్ ప్రావిన్స్‌లో మరో మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులైన స్వతంత్ర అభ్యర్థులు షరీఫ్ పార్టీ అభ్యర్థులకు చుక్కలు చూపించారు.
పాకిస్థాన్ ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఇమ్రాన్ ఖాన్ తన పార్టీ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్‌కు అంతర్గత ఎన్నికలు నిర్వహించని కారణంగా పార్టీ సింబలైన బ్యాట్ గుర్తును కోల్పోయారు. చెదురుముదురు హింసాత్మక ఘటనలతో పాకిస్థాన్‌లో గురువారం ఎన్నికలు ముగిశాయి.