న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆపద్దర్మ ప్రధానిగా ఆ దేశ మాజీ చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్ పేరును ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదించారు. జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు రెండు రోజుల క్రితం ఇమ్రాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాత్కాలిక ప్రధానిగా నియమించబోయే వారి పేర్లను ప్రకటించాలని అధ్యక్షుడు అల్వి లేఖ ఓ లేఖలో కోరారు. ఇమ్రాన్‌తో పాటు ప్రతిపక్ష నేతకు కూడా ఆ లేఖను పంపారు. పార్లమెంట్‌ను రద్దు చేసిన మూడు రోజుల్లోగా పేర్లను ప్రకటించాలని అధ్యక్షుడు అల్వి తన లేఖలో కోరారు. ఈ నేపథ్యంలో గుల్జార్ పేరును తాత్కాలిక పీఎం పదవికి నియమించాలని ఇమ్రాన్ ప్రతిపాదించారు.