Antarctica: అంటార్కిటికాలో భయపెడుతున్న భారీ మంచు కొండ
ఓ భారీ మంచు కొండ ఇప్పుడు భయపెడుతోంది. అంటార్కిటికా( Antarctica )లోని వెడెల్ సముద్రంలో తేలియాడుతున్న ఈ ఐస్‌బర్గ్.. పక్కనే ఉన్న బ్రంట్ ఐస్ షెల్ఫ్‌ను ఢీకొట్టేలా కనిపిస్తోంది.

లండన్: ఓ భారీ మంచు కొండ ఇప్పుడు భయపెడుతోంది. అంటార్కిటికా( Antarctica )లోని వెడెల్ సముద్రంలో తేలియాడుతున్న ఈ ఐస్‌బర్గ్.. పక్కనే ఉన్న బ్రంట్ ఐస్ షెల్ఫ్‌ను ఢీకొట్టేలా కనిపిస్తోంది. ఎ-74గా పిలుస్తున్న ఈ మంచు కొండ.. మన ఢిల్లీ అంత పెద్దది కావడం విశేషం. ఈ ఏడాది మొదట్లో ఇదే బ్రంట్ ఐస్ షెల్ఫ్ నుంచి ఈ ఎ-74 విడిపోయింది. దానికి మరీ సమీపంలో ఉన్నట్లుగా యురోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) తన రాడార్ ఫొటోల ద్వారా గుర్తించింది.
ఈ మంచు కొండ సైజు 1270 చదరపు కిలోమీటర్లు. ఇంత భారీ కొండ సముద్ర జలాల ప్రవాహం కారణంగా కదులుతూ వచ్చి బలంగా బ్రంట్ ఐస్ షెల్ఫ్‌ను ఢీకొంటే.. ఆ ధాటికి మరో 1700 చదరపు కిలోమీటర్ల సైజులో ఉండే మరో మంచు కొండ విడిపోతుందని భావిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న అంటార్కిటికాలోని ఉత్తర భాగంలో ఉన్న బ్రంట్ ఐస్ షెల్ఫ్ నుంచి ఈ ఎ-74 విడిపోయింది. గత కొన్నేళ్లుగా 150 మీటర్ల మందంగా ఉండే ఈ ఐస్ షెల్ఫ్‌లో భారీగా పగుళ్లు ఏర్పడినట్లు గ్లేసియాలజిస్టులు చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
Jupally Krishna Rao | మంత్రి జూపల్లి బాత్రూం రిపేర్‌కు రూ. కోటి.. అప్పు పుట్టడం లేదంటూనే సర్కార్ దుబారా !
Medicover | కిడ్నీ చికిత్సకు పోతే కాటికి పంపిండ్రు.. మెడికవర్‌లో న్యాయవాది మృతి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్‌లకు షాక్.. ఈ వారం నామినేషన్లలో ఆ ఆరుగురు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

