బుధవారం 27 జనవరి 2021
International - Dec 03, 2020 , 17:10:27

మ‌ళ్లీ నాలుగేళ్ల‌కు క‌లుస్తా.. వైట్‌హౌజ్ అతిథుల‌తో ట్రంప్‌

మ‌ళ్లీ నాలుగేళ్ల‌కు క‌లుస్తా.. వైట్‌హౌజ్ అతిథుల‌తో ట్రంప్‌

హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌.. 2024లో జ‌రిగే దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశాలు ఉన్నాయి.  తాజాగా ముగిసిన అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో బైడెన్ చేతిలో ట్రంప్ ఓడిన విష‌యం తెలిసిందే. అయితే వైట్‌హౌజ్‌లో జ‌రిగిన క్రిస్మ‌స్ పార్టీలో అధ్య‌క్షుడు ట్రంప్ త‌న భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక గురించి వెల్ల‌డించారు.  ఆ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన‌వారితో మాట్లాడుతూ.. గ‌డిచిన నాలుగేళ్లు అద్భుతంగా సాగాయ‌ని, మ‌రో నాలుగేళ్లు పాలించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని, వీలైతే మ‌ళ్లీ నాలుగేళ్ల త‌ర్వాత క‌లుస్తా అన్న సందేశాన్ని ట్రంప్ వినిపించారు. రిప‌బ్లిక్ పార్టీ వ‌ర్క‌ర్లు ఆ ఈవెంట్‌కు హాజ‌ర‌య్యారు. ఈ ఏడాది న‌వంబ‌ర్ 3వ తేదీన జ‌రిగిన ఎన్నిక‌ల్లో ట్రంప్ ఓడారు. కానీ ఓట‌మిని అంగీక‌రించ‌ని ఆయ‌న‌.. కొన్ని రాష్ట్రాల ఫ‌లితాల‌పై కోర్టును ఆశ్ర‌యించారు.  అమెరికా నూత‌న అధ్య‌క్షుడిగా బైడెన్ .. జ‌న‌వ‌రిలో ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. 


logo