లండన్, సెప్టెంబర్ 19: భూమిపై మానవాళి అంతరించిపోతే? దీనికి సమాధానంగా బ్రిటన్‌లోని సౌతాంప్టన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం.. సైన్స్ ఫిక్షన్‌ను తలపించే ఆవిష్కరణ చేశారు. మనిషి జన్యువులను ఒక ‘5డీ మెమరీ క్రిస్టల్’లో భద్రంగా దాచిపెట్టారు.
అంతరించే జాతిని తిరిగి రప్పించాలన్న సంకల్పంతో.. ఆస్ట్రియాలోని హాల్స్టాట్లో ఉన్న ఓ గుహలో భద్రంగా ఉంచారు. 360 టెరాబైట్ల మెమరీ కలిగిన ఆ క్రిస్టల్ ఎంత పటిష్టం అంటే.. 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను, గడ్డకట్టే చలిని సైతం తట్టుకుంటుంది.
13.8 బిలియన్ సంవత్సరాల వరకు డాటా భద్రంగా ఉంటుంది. ఒకవిధంగా చెప్పాలంటే ఆ క్రిస్టల్ క్వార్ట్లా అత్యంత గట్టిదనం కలిగినది. ఈ 5డీ క్రిస్టల్లో జన్యువును దాచేందుకు అల్ట్రా ఫాస్ట్ లేజర్లను ఉపయోగించారు. శాస్త్రవేత్తల ఘనతకుగానూ గిన్నిస్ బుక్‌లో చోటు కూడా దక్కింది.