Hug | ఆమెను కౌగిలించుకున్నందుకు.. రూ.లక్ష నష్టపరిహారం ఇవ్వాలన్న కోర్టు.. కారణం ఏంటంటే?
ఒకే కంపెనీలో ఉద్యోగం చేసే సమయంలో సంతోషాలు పంచుకునేందుకు కొలీగ్స్ కౌగిలించుకోవడం, హైఫైలు ఇచ్చుకోవడం సహజమే. అయితే ఇలా చేసిన ఒక వ్యక్తికి రూ.1.16 లక్షల ఫైన్ వేసిందో కోర్టు. దీనికి బలమైన కారణం ఉందండోయ్. ఈ ఘటన చైనాలోని యూయాంగ్ సిటీలో వెలుగు చూసింది. ఇక్కడ ఒక కంపెనీలో పనిచేసే మహిళ.. తన కొలీగ్‌తో ఏదో విషయంలో మాట్లాడుతోంది.
ఆ సమయంలో వెనక నుంచి వచ్చిన ఒక మగ కొలీగ్.. ఆమెను చాలా బలంగా వెనుక నుంచి కౌగిలించుకున్నాడు. అతను ఎంత గట్టిగా కౌగిలించుకున్నాడంటే సదరు మహిళ నొప్పితో పెద్దగా అరిచింది. అతని పట్టు నుంచి తప్పించుకున్న తర్వాత కూడా ఛాతీ భాగంలో నొప్పిగానే అనిపించిందామెకు. ఇంటికి వెళ్లిన తర్వాత వేడి నూనెతో మర్దన చేసుకుంది. అయినా నొప్పి తగ్గలేదు.
అదే తగ్గుతుందిలే అని వదిలేసింది. ఇలా ఐదు రోజులు గడిచినా కూడా నొప్పి ఏమాత్రం తగ్గలేదు. దాంతో ఆస్పత్రికి వెళ్లగా.. ఎక్స్‌రేలో ఆమె ఛాతీ భాగంలో మూడు పక్కటెముకలు విరిగినట్లు తేలింది. కుడివైపు రెండు, ఎడమవైపు రెండు రిబ్స్ విరిగాయని వైద్యులు తెలిపారు. దాంతో ఆమె ఆఫీసుకు రాలేక సెలవు పెట్టింది. ఈ సమయంలో జీతం కూడా అందలేదు.

దానికితోడు ఆస్పత్రి ఖర్చులు కూడా నెత్తినపడ్డాయి. ఈ నేపథ్యంలో తన గాయానికి కారణమైన కొలీగ్‌ను కలిసిన ఆమె.. తనకు అతని వల్లనే గాయమైందని, కాబట్టి ఆస్పత్రి ఖర్చులు కట్టాలని కోరింది. దానికి అతను నిరాకరించాడు. తన కౌగిలి వల్లనే ఎముకలు విరిగినట్లు సాక్ష్యం ఏంటన్నాడు.
అతన్ని ఒప్పించలేకపోయిన మహిళ యూంషీ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆఫీసు ఘటన తర్వాత ఆ యువతి ఎముకలు విరిగేంతటి పని ఏదీ చేసినట్లు కనిపించడం లేదని తెలిపింది. దీంతో ఆమెకు 10 వేల యువాన్లు (సుమారు రూ.1.16 లక్షలు) చెల్లించాలని గట్టిగా కౌగిలించుకున్న కొలీగ్‌ను ఆదేశించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- china
- court
- Hug
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

