రియాద్: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో గురువారం భారీ పేలుళ్లు సంభవించాయి. నగరంలోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు అభా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై దాడి జరిగింది.
హౌతీలు జరిపిన ఈ దాడుల్లో ముగ్గురు పౌరులు మృతి చెందగా, 36 మంది గాయపడ్డారని సౌదీ జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్(జీఏసీఏ) తెలిపింది. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో సంస్థలు అక్టోబర్ 10 వరకు రియాద్ వెళ్లే విమానాలను రద్దు చేశాయి.