లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ నటి అన్నే హెచ్చి కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైంది. లాస్ ఏంజిల్స్‌లో ఓ ఇంటిని ఆమె కారుతో ఢీకొట్టింది. మార్ విస్టా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెండు అంతస్థుల ఇళ్లు స్వల్పంగా ధ్వంసమైంది. బ్లూ కలర్ మినీ కూపర్‌లో ప్రయాణిస్తున్న ఆ నటి ప్రమాదానికి గురైంది. ఓ అపార్ట్మెంట్ బిల్డింగ్ గ్యారేజీకి 53 ఏళ్ల నటి కారును ఢీకొన్నది. ప్రమాద సమయంలో భారీ మంటలు వ్యాపించాయి. ఆ మంటల్ని ఆర్పేందుకు 59 మంది ఫైర్‌ఫైటర్లు కృషి చేసినట్లు తెలుస్తోంది. 1990 దశకంలో అన్నే హెచ్చి ఫేమస్ నటి. సిక్స్ డేస్, సెవన్ నైట్స్, డాన్నీ బ్రాస్కో, ఐ నో వాట్ యూ డిడ్ లాస్ట్ సమ్మర్ లాంటి చిత్రాల్లో ఆమె నటించింది. అనదర్ వరల్డ్ టీవీ షోలో నటించింది.