Today History: అది 1994 ఫిబ్రవరి 8.. అహ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియం.. రసవత్తరంగా భారత్-శ్రీలంక మధ్య మూడో టెస్ట్ మ్యాచ్.. గంట గడిచింది.. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. కపిల్‌దేవ్ వేసిన బంతిని శ్రీలంక ఓపెనర్ రోషన్ మహానామా ఆడగా.. షార్ట్ లెగ్‌లో ఉన్న సంజయ్ మంజ్రేకర్ బంతిని ఒడిసిపట్టుకున్నాడు. అంతే మోతేరా స్టేడియంలోని ఉన్న వారంతా కపిల్‌దేవ్‌కు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. కపిల్.. కపిల్. అంటూ స్టేడియం మార్మోగింది. కారణం అత్యధిక వికెట్లు తీసిన రిచర్డ్ హ్యాడ్లీ రికార్డును కపిల్ దేవ్ అధిగమించడం.
టెస్టు క్రికెట్లో 431 వికెట్లతో రిచర్డ్ హ్యాడ్లీ సృష్టించిన ప్రపంచ రికార్డును మన హర్యానా హరికేన్ బద్దలు కొట్టాడు. అహ్మదాబాద్ మోతేరా స్టేడియంలో పండగ వాతావరణం నెలకొన్నది. రిచర్డ్ హెడ్లీ రికార్డును బద్దలు కొట్టిన తర్వాత దూరదర్శన్ తన ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేసి ప్రత్యేక గీతాన్ని టెలీకస్ట్ చేసింది. దాంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. చప్పట్లతో అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేయగా.. తోటి ఆటగాళ్లు కపిల్‌ను ఆలింగనం చేసుకుని మనసారా అభినందించారు. దీన్ని సెలబ్రేట్ చేయడానికి 432 వికెట్లకు గుర్తుగా మైదానంలో 432 బెలూన్లను గాలిలో ఎగుర వేశారు. ఆనాడు దూరదర్శన్ ప్రసారం చేసిన ‘హకియాకత్ హై యా ఖ్వాబ్ నహీ, కపిల్ దేవ్ త్వద్దా జబ్ నహీ నహీ’ అనే ప్రత్యేక పాట ఇప్పటికీ క్రికెట్ అభిమానుల నాలుకపై నిలిచి ఉండటం విశేషం.
2008: ఒడిశా శిశుపాల్గఢ్లో జరిపిన తవ్వకాల్లో బయటపడిన రెండున్నర వేల ఏండ్లనాటి పురాతన నగరం
2005: ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
1986: ఢిల్లీ విమానాశ్రయంలో మొదటిసారిగా ప్రీపెయిడ్ టాక్సీ సేవ ప్రారంభం
1971: ప్రపంచంలో మొట్టమొదటి ఎలక్ట్రానిక్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నాస్డాక్ ప్రారంభం
1943: జర్మనీ నుంచి పడవలో జపాన్‌కు బయలుదేరిన సుభాష్ చంద్రబోస్
1941: గజల్ గాయకుడు జగ్జిత్ సింగ్ జననం
1897 : భారతదేశం తొలి ముస్లిం రాష్ట్రపతి జకీర్ హుస్సేన్ జననం
1872: అండమాన్, నికోబార్‌లో వైస్రాయ్ లార్డ్ మాయోను చంపిన కాలాపానీ శిక్షను అనుభవిస్తున్న షేర్ అలీ