బెర్లిన్: జర్మనీలోని హాంబర్గ్ విమానాశ్రయంలో (Hamburg Airport) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సాయుధుడైన ఓ వ్యక్తి తన కారుతో ఎయిర్‌పోర్టులోని రన్‌వేపైకి (Runway) దుసుకెళ్లాడు. ఓ విమానం ముందు తన కారును ఆపి గాల్లోకి రెండుసార్లు కాల్పులు జరిపాడు. దీంతో అధికారులు విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.
శనివారం రాత్రి 34 ఏండ్ల ఓ వ్యక్తి కారులో ఎయిర్‌పోర్టులోని బారికేడ్లను ఢీకొట్టి రన్‌వే పైకి దూసుకెళ్లాడు. రన్‌వేపై ఉన్న విమానానికి అడ్డంగా కారుని పార్క్ చేశాడు. దీంతో విమానంలోని ప్రయాణికులను గ్యాంగ్వే మార్గం గుండా సురక్షితంగా బయటకు పంపించారు. అతనితోపాటు 4 ఏండ్ల వయస్సున్న బాలిక కూడా ఉన్నదని అధికారులు చెప్పారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాలికను విడిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాల్పుల ఘటనతో 27 విమాన సర్వీసులపై ప్రభావం పడిందని తెలిపారు.