హెచ్-1బీలను రెట్టింపు చేయాలి

- గ్రీన్‌కార్డు కోటాలను తొలగించాలి
- ప్రభుత్వానికి అమెరికా చాంబర్‌ఆఫ్ కామర్స్ డిమాండ్లు
- ‘అమెరికా వర్క్’ పేరుతో ప్రచారోద్యమం
వాషింగ్టన్ : అమెరికాలో పని చేయటానికి ఉపయోగపడే హెచ్-1బీ వీసాలను ఇప్పుడిస్తున్నదానికంటే రెట్టింపు చేయాలనే డిమాండ్ స్వయంగా అమెరికాలోనే ఊపందుకుంటున్నది. శక్తివంతమైన ఆ దేశ చాంబర్ ఆఫ్ కామర్స్ ఈ మేరకు ‘అమెరికా వర్క్స్’ పేరుతో భారీ ఎత్తున ప్రచారాన్ని ఇటీవల ప్రారంభించింది. అమెరికాలో నిపుణుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. హెచ్-1బీ వీసాలను రెట్టింపు చేయాలని, అమెరికా పౌరసత్వానికి చిహ్నమైన గ్రీన్‌కార్డుల జారీలో ప్రస్తుతం దేశాలవారీగా విధిస్తున్న కోటాలను పూర్తిగా తొలగించాలని ఆ సంస్థ డిమాండ్ చేస్తున్నది. ఈ మేరకు బైడెన్ యంత్రాంగానికి, కాంగ్రెస్‌కు విజ్ఞాపనలు చేసింది. అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ చేస్తున్న డిమాండ్లు ఇలా ఉన్నాయి..
- ఉద్యోగ వీసాలను (హెచ్-1బీ, హెచ్-2బీ) ప్రస్తుతం ఏటా 1,40,000 మంజూరు చేస్తున్నారు. దీనిని 2.8లక్షలకు పెంచాలి.
- ఏటా ఇచ్చే గ్రీన్‌కార్డు కోటాలో ఉద్యోగి భార్య/ భర్తను, మైనర్ పిల్లలనూ లెక్కించే పద్ధతిని విడనాడాలి. దీంతో అమెరికాలో పని చేయటానికి అవకాశం లభించే వారి సంఖ్య రెట్టింపవుతుంది.
- దేశాలవారీ కోటా పద్ధతిని తొలగించాలి.
- అమెరికా యూనివర్సిటీల్లో విద్యాభ్యాసం చేసి డిగ్రీలు తీసుకున్న విదేశీ విద్యార్థులకు ఎంప్లాయిమెంట్ బేస్డ్ గ్రీన్‌కార్డుల జారీలో మరిన్ని అవకాశాలు కల్పించాలి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శాశ్వత నివాసం కల్పించాలి.
- ప్రపంచవ్యాప్తంగా అమెరికా రాయబార కార్యాలయాల్లో వీసా ప్రాసెసింగ్‌ను నిరంతరప్రక్రియగా తిరిగి చేపట్టాలి.
- తగినంత జనాభా లేకపోవటం వల్ల తీవ్రమైన ఆర్థిక, సామాజిక సమస్యలను ఎదుర్కొంటున్న అమెరికా వర్గాల్లో జనసంఖ్యను, ఆర్థికాభివృద్ధిని పెంచే లక్ష్యంతో వీసా కార్యక్రమాలను చేపట్టాలి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

