లండన్, అక్టోబర్ 19: బ్రిటన్లో రోజుకో రాజకీయ పరిణామం చోటుచేసుకొంటున్నది. భారతీయ మూలాలున్న ఆ దేశ హోం సెక్రటరీ సుయెల్లా బ్రేవర్మన్ తన పదవికి రాజీనామా చేశారు.
మైగ్రేషన్ అంశంపై అధికారిక పత్రాలను తన వ్యక్తిగత ఈ-మెయిల్ నుంచి సహచర పార్లమెంటేరియన్కు పంపారు. అది తప్పని, సాంకేతిక నిబంధనలు ఉల్లంఘించినందుకు బాధ్యత వహిస్తూ ఆమె పదవి నుంచి వైదొలిగారు.