Karachi | ప్రపంచంలోనే అతి తక్కువ నివాసయోగ్యమైన నగరంగా కరాచీ
ప్రపంచంలోని అతి తక్కువ నివాసయోగ్యమైన నగరంగా పాకిస్థాన్‌కు (Pakistan) చెందిన కరాచీ (Karachi) నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 173 నగరాల్లో 169వ స్థానంలో ఉంది. లాగోస్, అల్జీర్స్, ట్రిపోలీ, డమాస్కస్ నగరాలు మాత్రమే కరాచీ కంటే తక్కువ స్థానంలో ఉన్నాయి.
ఇస్లామాబాద్: ప్రపంచంలోని అతి తక్కువ నివాసయోగ్యమైన నగరంగా పాకిస్థాన్‌కు (Pakistan) చెందిన కరాచీ (Karachi) నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 173 నగరాల్లో 169వ స్థానంలో ఉంది. లాగోస్, అల్జీర్స్, ట్రిపోలీ, డమాస్కస్ నగరాలు మాత్రమే కరాచీ కంటే తక్కువ స్థానంలో ఉన్నాయి. 2023కుగాను లండన్‌కి చెందిన ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (EIU) గ్లోబల్ లివబులిటీ ఇండెక్స్ (Global Livability Index) జాబితాను విడుదల చేసింది.

కోవిడ్-19 మహమ్మారి తర్వాత (Post-COVID recovery) సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి చేసిన ప్రయత్నాల ఆధారంగా చేసుకుని సుస్థిరత, ఆరోగ్య సంరక్షణ, సంస్కృతి, పర్యావరణం, విద్య, మౌలిక సదుపాయాలను పరిగణనలోకి తీసుకొని జీవన పరిస్థితులను లెక్కిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 173 నగరాల్లో ఒక వ్యక్తి జీవనశైలికి ఎదురయ్యే సవాళ్లను ఈ సూచిక లెక్కించింది. నివాస యోగ్యతను అంచనా వేయడానికి 1-100 రేటింగ్స్‌ను నిర్ణయిస్తుంది. ఇక్కడ 1 పాయింట్ వస్తే భరించలేనిదిగా, 100 రేటింగ్ వస్తే దానిని ఆదర్శ మైనదిగా పరిగణిస్తుంది.అయితే ఈ ఐదు అంశాల్లో కరాచీ 42.5 స్కోర్‌ను మాత్రమే సాధించింది. ఇందులో స్థిరత్వ సూచికలో 20 పాయింట్లు, ఆరోగ్య సంరక్షణలో 50, సంస్కృతి, పర్యావరణంలో 38.7, విద్యలో 75, మౌలిక సదుపాయాల్లో 51.8 స్కోర్ చేసింది. ఇది ఆదర్శం కంటే తక్కువ కావడంతో అతి తక్కువ నివాసయోగ్యమైన నగరాల్లో ఐదో స్థానాన్ని కేటాయించింది. కాగా, 2019 నుంచి గ్లోబల్ లివబులిటీ ఇండెక్స్‌లో కరాచీ స్థానం అంత మెరుగ్గా ఏమీలేదు. 2019లో మొత్తం 140 నగరాల్లో 136వ స్థానంలో ఉండగా, 2022లో 140 ప్లేస్ ఉన్నది. 2020లో జాబితాను వెలువరించలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

