పారిస్, జనవరి 9: ఫ్రాన్స్ నూతన ప్రధానిగా 34 ఏండ్ల గాబ్రియెల్ అట్టల్ నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడు, తొలి గే వ్యక్తిగా అట్టల్ నిలిచారు.
పెన్షన్, వలస నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తూ మాక్రాన్ సర్కార్ సంస్కరణలకు తెరలేపటాన్ని వ్యతిరేకిస్తూ దేశ ప్రధాని పదవికి ఎలిసాబెత్ బోర్న్ సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.