Indians try to enter US | కెనడా గూడ్స్ రైలు నుంచి దూకి.. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన ముగ్గురు భారతీయులు అరెస్ట్
Indians try to enter US | ముగ్గురు భారతీయులు కెనడా గూడ్స్ రైలు నుంచి దూకారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ సిబ్బంది వారిని గుర్తించారు. భారతీయులైన మహిళ, ఇద్దరు పురుషులతోపాటు మరో దేశ పౌరుడ్ని అరెస్ట్ చేశారు.
వాషింగ్టన్: ముగ్గురు భారతీయులు కెనడా గూడ్స్ రైలు నుంచి దూకారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. (Indians try to enter US) అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ సిబ్బంది వారిని గుర్తించారు. భారతీయులైన మహిళ, ఇద్దరు పురుషులతోపాటు మరో దేశ పౌరుడ్ని అరెస్ట్ చేశారు. మార్చి 12న నలుగురు వ్యక్తులు కెనడా సరకు రవాణా రైలులో ప్రయాణించారు. కెనడా, అమెరికా సరిహద్దు ప్రాంతమైన బఫెలోలో అంతర్జాతీయ రైల్ రోడ్ వంతెనపై కదులుతున్న రైలు నుంచి వారు దూకారు. ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. కదలలేని పరిస్థితిలో ఉన్న ఆమె రైలు నుంచి దూకిన చోటే ఉండగా, మిగతా ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, నలుగురు వ్యక్తులు అమెరికా భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించడాన్ని ఆ దేశ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ సిబ్బంది గుర్తించారు. వెంబడించి ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. గాయపడిన మహిళకు ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. ఆ మహిళతో పాటు ఇద్దరు పురుషులను భారతీయులుగా గుర్తించారు. నాల్గవ వ్యక్తి డొమినికన్ రిపబ్లిక్కు చెందినట్లు తెలిపారు.
న్యూయార్క్‌లోని బటావియా ఫెడరల్ డిటెన్షన్ కేంద్రంలో వారిని నిర్బంధించారు. అమెరికా నుంచి తిరిగి పంపేందుకు చట్టపరంగా చర్యలు చేపడుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- arrested
- Canada train
- Enter
- Indians
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

