Plane crash | రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన విమానం.. నలుగురు దుర్మరణం
Plane crash | బ్రెజిల్ (Brazil) లో ఓ రెస్టారెంట్ (Restaurant) లోకి విమానం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దక్షిణ బ్రెజిల్లో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
Plane crash : బ్రెజిల్ (Brazil) లో ఓ రెస్టారెంట్ (Restaurant) లోకి విమానం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దక్షిణ బ్రెజిల్లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఒక చిన్న విమానం ఆరుగురితో కాపావో డా కానావో విమానాశ్రయం నుంచి బయలుదేరింది. టేకాఫ్ అయిన వెంటనే విమానం రన్‌వే చివరన ఉన్న ఒక స్తంభాన్ని ఢీకొట్టింది.
ఈ క్రమంలో పక్కనే ఉన్న మరో రెస్టారెంట్లోకి దూసుకెళ్లి కూలిపోయింది. దాంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో పైలట్ సహా ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రమాద సమయంలో రెస్టారెంట్ మూసేసి ఉంది. దాంతో భారీగా ప్రాణనష్టం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. సహాయ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ముందుజాగ్రత్తగా రెస్టారెంట్ సమీపంలోని నివాసితులను ఖాళీ చేయించారు. ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

