UK | యూకేలో డ్రైవర్ దారుణ హత్య.. నలుగురు భారత సంతతి వ్యక్తులకు 122 ఏండ్ల జైలు శిక్ష
UK | యూకేలో నలుగురు భారత సంతతికి చెందిన వ్యక్తులకు 122 ఏండ్ల జైలుశిక్ష పడింది. ఓ డెలివరీ కంపెనీలో పనిచేసే డ్రైవర్‌ను ప్లాన్ ప్రకారం ఫాలో చేసి దారుణంగా కొట్టి చంపినందుకుగానూ స్టాఫోర్డ్ క్రౌన్ కోర్టు ఈ తీర్పునిచ్చింది. హత్యకు సహకరించిన నిందితుడికి కూడా పదేండ్ల జైలు శిక్ష విధించింది.
UK | యూకేలో నలుగురు భారత సంతతికి చెందిన వ్యక్తులకు 122 ఏండ్ల జైలుశిక్ష పడింది. ఓ డెలివరీ కంపెనీలో పనిచేసే డ్రైవర్‌ను ప్లాన్ ప్రకారం ఫాలో చేసి దారుణంగా కొట్టి చంపినందుకుగానూ స్టాఫోర్డ్ క్రౌన్ కోర్టు ఈ తీర్పునిచ్చింది. హత్యకు సహకరించిన నిందితుడికి కూడా పదేండ్ల జైలు శిక్ష విధించింది.
పశ్చిమ ఇంగ్లాండ్ ష్రూస్‌బరీలోని బెర్విక్ అవెన్యూలో గతేడాది ఆగస్టులో ఓ మర్డర్ జరిగింది. భారత సంతతికి చెందిన ఔర్మాన్ సింగ్ అనే డెలివరీ డ్రైవర్‌ను దారుణంగా కొట్టిచంపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న స్థానిక మెర్సియా పోలీసులు.. హత్యలో ప్రమేయం ఉందని నలుగురు భారత సంతతి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అర్ష్‌దీప్ సింగ్ (24), జగ్దీప్ సింగ్ (22), శివదీప్ సింగ్ (26), మంజోత్ సింగ్ (24)లను అరెస్టు చేసి వారి నుంచి గొడ్డలి, హాకీ స్టిక్, పారను స్వాధీనం చేసుకున్నారు. పక్కా పథకం ప్రకారమే డెలివరీ డ్రైవర్‌ను ఈ నలుగురు దారుణంగా హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. డ్రైవర్‌ను హత్య చేసేందుకు అతను ఎక్కడికి వెళ్తాడు.. ఆరోజు ఎక్కడెక్కడ అతనికి డెలివరీలు ఉన్నాయనే విషయాన్ని సుఖ్‌మన్‌దీప్ సింగ్(23) ద్వారా తెలుసుకున్నారు. అతన్ని వెంటాడి దారుణంగా కొట్టి చంపేశారని నిర్ధారించారు.
ఈ హత్య కేసుపై విచారణ జరిపిన స్టాఫోర్డ్ క్రౌన్ కోర్టు ఈ నలుగుర్ని ఇటీవల దోషులుగా గుర్తించింది. ఈ క్రమంలోనే నలుగురికీ యావజ్జీవ శిక్ష విధిస్తూ ఇవాళ తీర్పును వెల్లడించింది. కనీసం 28 ఏళ్ల పాటు లాకప్‌లోనే ఉంచాలని ఆదేశించింది. అలాగే హత్యకు సహకరించిన సుఖ్మన్ సింగ్‌కు పదేండ్ల జైలు శిక్షను విధించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sampath Nandi | డింపుల్ హయతికి బహిరంగంగా క్షమాపణ చెప్పిన సంపత్ నంది.. ‘భోగి’ ట్రైలర్ లాంచ్‌లో ఆసక్తికర ఘటన!
Farmers Protest | ధాన్యం కొనుగోలు చేయాలంటూ కప్రాయిపల్లిలో రైతుల ధర్నా
Viral Pic | అనిరుధ్–కావ్య మారన్ రిసెప్షన్లో విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నూతన దంపతులతో ఫొటో వైరల్!
IND vs NZ | చివరి రోజు కివీస్ పోరాటం.. డ్రాగా ముగిసిన తొలి టెస్టు
Jagadish Reddy | బీఆర్ఎస్ నేతల అరెస్టుపై జగదీశ్ రెడ్డి ధ్వజం.. డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ



