High BP: అధిక రక్తపోటుపై రిపోర్టు ఇచ్చిన డబ్ల్యూహెచ్వో
High BP: అధిక రక్తపోటుకు ప్రతి అయిదుగురిలో నలుగురు సరైన చికిత్సను పొందడం లేదని డబ్ల్యూహెచ్వో తెలిపింది. ప్రపంచదేశాలు బీపీ గురించి చైతన్యాన్ని కలిగిస్తే, 2023 నుంచి 2050 సంవత్సరం లోపు సుమారు 7.6 కోట్ల మందిని బ్రతికించుకోవచ్చు అని తన రిపోర్టులో పేర్కొన్నది.
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా హైబీపీ(High BP)తో బాధపడుతన్న వారి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఓ రిపోర్టును రిలీజ్ చేసింది. హైబీపీతో బాధపడుతున్న ప్రతి అయిదుగురిలో నలుగురు సరైన చికిత్సను పొందడం లేదని డబ్ల్యూహెచ్వో తెలిపింది. అయితే ఆయా దేశాలు బీపీ గురించి చైతన్యాన్ని కలిగిస్తే, 2023 నుంచి 2050 సంవత్సరం లోపు సుమారు 7.6 కోట్ల మందిని బ్రతికించుకోవచ్చు అని పేర్కొన్నది. ఇండియాలో ఎక్కువ శాతం మరణాలకు హై బీపీనే ముఖ్య కారణమని రిపోర్టులో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు వయోజనుల్లో.. ఒకరికి హైపర్టెన్షన్ సోకుతుందని రిపోర్టులో పేర్కొన్నారు. హైబీపీ వల్ల స్ట్రోక్, హార్ట్ అటాక్, హృద్రోగ సమస్యలు, కిడ్నీ డ్యామేజ్ లాంటి సమస్యలు ఉత్పన్నం కానున్నాయి.
140/90 mmHg లేదా అంతకన్నా ఎక్కువ స్థాయిలో బీపీ ఉన్న వ్యక్తులు 1990 నుంచి 2019 వరకు రెండింతలు పెరిగినట్లు రిపోర్టులో వెల్లడించారు. ఈ సంఖ్య 65 కోట్ల నుంచి 103 కోట్లకు చేరుకున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా బీపీతో ఉన్న సగం మందికి తమ ప్రస్తుత పరిస్థితి తెలియదన్నారు. వృద్ధాప్యం, జన్యు సమస్యలు ఉన్నవారిలో మరింత అధిక రక్తపోటు ఉంటుంది. బలవర్దకమైన ఆహారం తీసుకుని, పొగాకును మానేస్తే రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. యాక్టివ్గా ఉండడం వల్ల కూడా బీపీ తగ్గుతుంది. గుండెపోటు వల్ల ప్రతి గంటకు వెయ్యి మంది మరణిస్తున్నారని డాక్టర్ టామ్ ప్రైడెన్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- High BP
- hypertension
- WHO
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

