వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం ఆరోపణలపై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ జైలుకెళ్లారు. 2020 ఎన్నికల ఫలితాలను తారుమారు చేయాలని ప్రయత్నించారనే ఆరోపణలపై జైలులో లొంగిపోయారు. 22 నిమిషాల అనంతరం విడుదలయ్యారు. కాగా, జైలులో మగ్షాట్ (పోలీసు రికార్డుల కోసం ఫొటో) తీయించుకొన్న అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా నిలిచారు.
గత ఐదునెలల్లో ట్రంప్ ఐదుసార్లు అరెస్ట్ అయ్యారు. కానీ పోలీసు కేసు కింద బుక్ చేసి తొలిసారిగా మగ్షాట్ తీశారు. ఈ ఫొటోను ట్రంప్ ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేయగా, వైరల్గా మారింది. ఇలాంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తమకు తాముగా లొంగిపోయినా అరెస్ట్ కిందే పరిగణిస్తారు.