వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత జిమ్మీ కార్టర్ (Jimmy Carter) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో జార్జియాలోని ప్లెయిన్స్లో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు జేమ్స్ ఇ. కార్టర్ తెలిపారు. రెండు నెలల క్రితమే (అక్టోబర్ 1న) 100వ పుట్టిన రోజు జరుపుకున్న కార్టర్.. అమెరికాకు 39వ అధ్యక్షుడిగా వ్యవహరించారు. దీంతో అమెరికా చరిత్రలో ఎక్కువ రోజులు జీవించిన తొలి ప్రెసిడెంట్‌గా రికార్డు సృష్టించారు. 2002లో నోబెల్ శాంతి పురస్కారం దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన డెమొక్రటిక్ పార్టీ సభ్యుడిగా ఉన్నారు.
1924 అక్టోబర్ 1న రైతు కుటుంబంలో జన్మించిన జమ్మీ కార్టర్.. అమెరికా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. 1977లో అసాధారణ రీతిలో ఆయన దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 1981 వరకు ప్రెసిడెంట్‌గా కొనసాగారు. కాగా, 1946లో యూఎస్ నవల్ అకాడమీలో చేరిన జిమ్మీ కార్టర్, ఆ తర్వాత యూఎస్ నేవీ సబ్‌మెరైన్ సర్వీస్‌లో పని చేశారు. మిలిటరీ సేవలు ముగించుకున్న తర్వాత తన కుటుంబంతో కలిసి పల్లీల వ్యాపారాన్ని మొదలుపెట్టారు. అమెరికాలో పెరిగిపోతున్న జాత్యాహంకారాన్ని చూసి తట్టుకోలేక 1960ల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1971లో తొలిసారిగా జార్జియా రాష్ట్రానికి గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సరిగ్గా ఆరేండ్ల తర్వాత రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు గెరాల్డ్ ఫోర్డ్‌ను ఓడించి జిమ్మీ కార్టర్ అమెరికా ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు.
1976లో రిప్లబిక్ పార్టీ ప్రెసిడెంట్ గెరాల్డ్ ఫోర్డ్‌పై గెలిచి, అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తన పదవీకాలంలో మానవ హక్కుల పరిరక్షణతోపాటు పర్యావరణ సంక్షేమం కోసం కృషి చేశారు. 1978లో ఇజ్రాయిల్, ఈజిప్ట్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంలో కార్టర్ కీలక పాత్ర పోషించారు. 2002లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. కార్టర్ భార్య రోసలెన్ స్మిత్.. 2023లో 96 ఏండ్ల వయసులో మృతి చెందారు. వీరికి నలుగురు సంతానం.
When I look at Jimmy Carter, I see a man not only for our times, but for all times. A man who embodied the most fundamental human values we can never let slip away.
And while we may never see his likes again, we would all do well to try to be a little more like Jimmy Carter. pic.twitter.com/I0xDM05xmH
— President Biden (@POTUS) December 30, 2024
కాగా, 1978 లో అప్పటి జనతా పార్టీ ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఆయన భారతదేశంలో మూడు రోజుల పాటు పర్యటించారు. ఆ సందర్భంగా గుర్గావ్ సమీపంలోని దౌల్తాపూర్ను సందర్శించడంతో ఆ ఊరు పేరు కాస్తా కార్టర్పూర్గా మారిపోయింది. కాగా, జిమ్మీ కార్టర్ మృతిపట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రమథ మహిళ జిల్ బైడెన్ సంతాపం తెలిపారు.
Happy 100th Birthday, President Carter.
To put it simply: I admire you so darn much. pic.twitter.com/09DUDUlz9d
— President Biden (@POTUS) October 1, 2024