పారిస్: ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ(Nicolas Sarkozy)కి అయిదేళ్ల శిక్ష పడింది. పారిస్ కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. ఆయనకు లక్ష యూరోల జరిమానా కూడా విధించారు. అక్రమ రీతిలో లిబియా నుంచి నిధులు తీసుకున్నట్లు సర్కోజీపై ఆరోపణలు ఉన్నాయి. నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు పారిస్ కోర్టు తన తీర్పులో వెల్లడించింది. లిబియా నేత మొహమ్మద్ గడ్డాఫీ నుంచి అక్రమంగా నిధులను సేకరించి 2007 దేశాధ్యక్ష ఎన్నికల్లో సర్కోజీ పోటీ చేసి గెలిచినట్లు ఆరోపణలు ఉన్నాయి.
2007 నుంచి 2012 వరకు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా సర్కోజీ చేశారు. అయితే అనేక కేసుల్లో సర్కోజీని నిర్దోషిగా తేల్చింది కోర్టు. 2005 నుంచి 2007 మధ్య అవినీతికి పాల్పడిన కేసులో సర్కోజీపై నేరపూరిత కుట్ర అభియోగాలను మోపారు. సర్కోజీ వయసు 70 ఏళ్లు. పారిస్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఆయన అప్పీల్ చేసే అవకాశం ఉన్నది. తన వయసు దృష్ట్యా షరతులతో విడుదల చేసే అంశాన్ని ప్రస్తావించనున్నారు. ఫ్రాన్స్‌లో దేశాధ్యక్షుడికి శిక్ష పడడం ఇదే మొదటిసారి.