చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ కన్నుమూత
1989లో టియాన్మెన్ స్క్వేర్‌లో ప్రజాస్వామ్య అనుకూల నిరసనకారులపై రక్తపాతంతో కూడిన అణిచివేత అనంతర పరిస్థితుల్లో చైనా పాలక కమ్యూనిస్ట్ పార్టీకి జియాంగ్ జెమిన్ నాయకత్వం వహించారు.
బీజింగ్: చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ కన్నుమూశారు. ఆయన వయసు 96 ఏళ్లు. లుకేమియా, బహుళ అవయవ వైఫల్యం వల్ల సొంత నగరమైన షాంఘైలో బుధవారం మధ్యాహ్నం 12.13 గంటలకు జియాంగ్ తుదిశ్వాస విడిచినట్లు చైనా అధికార మీడియా తెలిపింది. చైనాలోని అధికార కమ్యూనిస్ట్ పార్టీ, పార్లమెంట్, కేబినెట్‌తోపాటు ఆ దేశ ఆర్మీ కూడా జియాంగ్ జెమిన్ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. తమకు తీరని లోటు అని పేర్కొంది.
కాగా, 1989లో టియాన్మెన్ స్క్వేర్‌లో ప్రజాస్వామ్య అనుకూల నిరసనకారులపై రక్తపాతంతో కూడిన అణిచివేత అనంతర పరిస్థితుల్లో చైనా పాలక కమ్యూనిస్ట్ పార్టీకి జియాంగ్ జెమిన్ నాయకత్వం వహించారు. 1993 మార్చి 27 నుంచి 2003 మార్చి 15 వరకు దేశ అధ్యక్షుడిగా ఉన్నారు. దౌత్యపరమైన ఒంటరితనం నుంచి చైనాను ఆయన బయటకు తెచ్చారు. అమెరికాతో సంబంధాలను పునరుద్ధరించారు. తద్వారా అపూర్వమైన చైనా ఆర్థిక వృద్ధికి ఆయన బాటలు వేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

