న్యూయార్క్: పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్(Taylor Swift).. బిలియనీర్ల జాబితాలో చేరారు. ఈ విషయాన్ని ఫోర్బ్స్ కంపెనీ ద్రువీకరించింది. వంద కోట్ల డాలర్లు దాటిన వారి సంంపన్నుల జాబితాను ఫోర్బ్స్ రిలీజ్ చేసింది. కేవలం మ్యూజిక్ ఆల్బమ్‌ల ఆధారంగా బిలియనీర్ హోదాను పొందిన తొలి ఆర్టిస్టుగా టేలర్ స్విఫ్ట్ నిలుస్తుందని ఫోర్బ్స్ తన రిపోర్టులో తెలిపింది. టేలర్ ఆస్తి సుమారు1.1 బిలియన్ల డాలర్లుగా ఉంటుందని భావిస్తున్నారు. గతంలో పాప్ సింగర్లు రిహాన్నా, జే-జెడ్‌లు బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్నా.. వాళ్లు తమ ఫ్యాషన్ బ్రాండ్ల ద్వారా కూడా ఆదాయాన్ని ఆర్జించారు.
స్వయంగా పాటలు రాసి పాడే టేలర్ స్విఫ్ట్.. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఇరాస్ టూర్ నిర్వహిస్తోంది. ఆ మ్యూజిక్ టూర్ ద్వారా పలుదేశాల ఆర్థిక వ్యవస్థలను పునరుత్తేజం చేసింది. 34 ఏళ్ల టేలర్ స్విఫ్ట్‌కు న్యూయార్క్, బెవర్లీ హిల్స్, నాష్విల్లే, రోడ్ ఐలాండ్‌లో ఇండ్లు ఉన్నాయి. ఇరాస్ టూర్ కోసం టేలర్ స్విఫ్ట్ చేసిన టూర్ కొత్త మైలరాయిని నమోదు చేసింది. గత రికార్డులను ఆ టూర్ తిరగరాసింది. ఇటీవల ఆమె నాలుగవ గ్రామీ అవార్డు గెలుచుకున్న విషయం కూడా తెలిసిందే.
ఈసారి ఫోర్బ్స్ జాబితాలో అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు ఉన్నారు. వంద కోట్ల డాలర్లు దాటిన వారి జాబితాలో ప్రపంచవ్యాప్తంగా 2781 మంది ఉన్నట్లు ఫోర్బ్స్ రిపోర్టు తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే 141 మంది పెరిగారు. కొత్తగా బిలియనీర్ల జాబితాలో చేరిన వారిలో 265 మంది ఉన్నారు. దాంట్లో టేలర్ స్విఫ్ట్ ఒకరు కావడం విశేషం. ప్రపంచంలోని బిలియనీర్ల మొత్తం ఆస్తి సుమారు 14.2 ట్రిలియన్ల డాలర్లుగా ఉందని భావిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే రెండు ట్రిలియన్ల డాలర్లు పెరిగింది. ఇక గత పదేళ్లలో ఆ బిలియనీర్ల సంపద కూడా 120 శాతం పెరిగినట్లు అంచనా వేస్తున్నారు.
Think you know the world’s celebrity billionaires? The 2024 #ForbesBillionaires rankings has the answers: https://t.co/NveGhbH8Ef
— Forbes (@Forbes) April 3, 2024