లాస్ ఏంజెలిస్: మైగ్రేన్ తలనొప్పి వల్ల మెదడులో ఏర్పడే పరిణామాలపై శాస్త్రవేత్తలు అనేక కొత్త విషయాలు కనిపెట్టారు. మైగ్రేన్ తీవ్రమైన తలనొప్పిని కలిగించడంతోపాటుగా శరీరంలో ఎన్నో మార్పులకు కారణమవుతుందని లాస్‌ఏంజెలిస్‌లోని సదర్న్ కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. మెదడు చుట్టూ ఉండే రక్తనాళాల కవచాలు మైగ్రేన్ వల్ల బాగా ఉబ్బుతాయని ఎమ్మారై స్కాన్ల ద్వారా తెలుసుకొన్నారు. మెదడులోని చిన్నరక్త నాళికలు దెబ్బతింటాయని తెలిసింది. ప్రస్తుతం పెయిన్ కిల్లర్సహా పలురకాల మందులు డాక్టర్లు మైగ్రేన్‌కు సిఫారసు చేస్తున్నారు. ఇందులో చాలా వరకు లక్షణాలను తగ్గించేవే. కానీ కొత్తగా తెలుసుకొన్న విషయాలు మైగ్రేన్‌కు కొత్తరకం చికిత్సలు కనిపెట్టేందుకు ఉపకరిస్తాయని భావిస్తున్నారు.