Humanoid Robot | న్యూయార్క్, ఫిబ్రవరి 22: రోబోటిక్స్ రంగంలో సరికొత్త ఆవిష్కరణ చోటుచేసుకున్నది. అమెరికాకు చెందిన ఫిగర్ ఏఐ అనే సంస్థ ‘హెలిక్స్’ పేరుతో సరికొత్త రోబోను ఆవిష్కరించింది. ఈ రోబో మనుషుల్లా ఆలోచించగలదని, ఇంటిలోని ప్రతీ వస్తువును గుర్తించగలదని ఫిగర్ ఏఐ సంస్థ వ్యవస్థాపకుడు బ్రెట్ ఆడ్కాక్ ప్రకటించారు.
మన మాటలను అర్థం చేసుకుంటుందని, మనం అడిగిన ఏ వస్తువునైనా తెచ్చి మన చేతికిస్తుందని చెప్పారు. ఈ రోబో ఎగువ భాగం మొత్తాన్ని నియంత్రించవచ్చని, మణికట్లు, తల, మొండెం, విడిగా వేళ్లపై నియంత్రణ ఉంటుందని పేర్కొన్నారు. ఒక రోబోపై ఈ స్థాయిలో నియంత్రణ పొందడం ఇదే మొదటిసారి అని చెప్పారు.