ఉక్రెయిన్‌పై రష్యా బాంబులతో విరుచుకుపడుతోంది. బయటికి గాంభీర్యత నటిస్తున్నా… పుతిన్‌కు మాత్రం లోలోపల తీవ్రమైన భయం కూడా అంతే స్థాయిలో ఉందని అంతర్జాతీయ మీడియా పేర్కొంటూనే వుంది. యుద్ధం నుంచి ఎలా బయటపడాలో పుతిన్‌కు తోచడం లేదని కూడా వార్తలొస్తున్నాయి. అయితే.. తాజాగా మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ 1000 మంది వ్యక్తిగత సిబ్బందిని విధుల్లో నుంచి తొలగించారు. వంట చేసే సిబ్బంది, భద్రతా సిబ్బంది, ప్రైవేట్ సెక్రెటరీలు.. ఇలా దాదాపు 1000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించేశారు.
వీరి స్థానంలో కొత్త వారిని నియమించుకున్నారు. పాత సిబ్బంది తనకు విషమిచ్చి, చంపేస్తారన్న భయం పుతిన్‌లో నెలకొందరని రష్యా మీడియా పేర్కొంటోంది. పుతిన్‌కు విషమిచ్చి చంపేస్తారని ఈ మధ్యే రష్యా ఇంటెలిజెన్స్ రిపోర్టులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఒక్క కారణంగానే పుతిన్ 1000 మంది వ్యక్తిగత సిబ్బందిని విధుల్లో నుంచి తొలగించారు.
రష్యాకు చెందిన ఓ మీడియాకు పుతిన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన తర్వాత కొందరు సిబ్బంది తనకు వ్యతిరేకంగా ఏమైనా చేయవచ్చని, తనను హత్య కూడా చేయవచ్చని, ఇందుకు పథక రచన కూడా సాగుతోందని పేర్కొన్నారు. పుతిన్ తినే ఆహారంలో విషం కలిపి ఆయన్ను చంపాలని చూస్తున్నారని తెగ ప్రచారం జరుగుతోంది.