Meta Layoffs | మరింతమంది ఉద్యోగులను తొలగించనున్న మెటా!
ఫేస్బుక్ (Facebook) మాతృసంస్థ మెటా (Meta) ప్లాట్‌ఫామ్స్ మరోసారి ఉద్యోగులకు షాక్ ఇవ్వనుంది. రానున్న నెలల్లో విడుతలవారీగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు (Layoffs) రంగం సిద్ధం చేసింది.
Meta Layoffs | ఫేస్బుక్ (Facebook) మాతృసంస్థ మెటా (Meta) ప్లాట్‌ఫామ్స్ మరోసారి ఉద్యోగులకు షాక్ ఇవ్వనుంది. రానున్న నెలల్లో విడుతలవారీగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు (Layoffs) రంగం సిద్ధం చేసింది. గతేడాది నుంచి తొలగించిన 13 శాతానికి ఇది అటూఇటుగా ఉండనుందని వాల్ స్ట్రీట్ జర్నల్ (Wall Street Journal) నివేదిక వెల్లడించింది. ఉద్యోగులపై వేటు (Jobs Cut) వచ్చే వారం ప్రారంభమవుతుందని, ఇది నెలల పాటు విడుతల వారీగా కొనసాగుతుందని పేర్కొన్నది. ఈసారి అత్యధికంగా నాన్ ఇంజినీరింగ్ విధుల్లో (Non-engineering roles) పనిచేస్తున్నవారిపై ప్రభావం ఉండనుందని తెలిపింది. దీంతోపాటు కొన్ని ప్రాజెక్టులను మూసివేయనుందని, అత్యవసరం కానీ టీమ్‌లను పూర్తిగా తొలగించనుందని వివరించింది. అయితే ఈ నివేదికలపై ఇప్పటివరకు మెటా ఎలాంటి ప్రకటన చేయలేదు.

మెటా కంపెనీ గత ఏడాది నవంబర్‌లో 11 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఇప్పటివరకు ఓ టెక్కంపెనీ ఇంత పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటిసారి. కాగా, ప్రకటనల ఆదాయం తగ్గడంతో ఆర్థిక లక్ష్యాలను మెటా చేరుకోలేకపోయింది. దీంతో మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైందని వాల్ స్ట్రీట్ నివేదించింది.
ఆదాయం తగ్గడం, ఆర్థిక అనిశ్చితి, ఆర్థిక మాంద్యం భయాలతో మెటాతోపాటు మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఐబీఎం, హెచ్‌పీ సహా మరిన్ని దిగ్గజ సంస్థలు వేలాది మంది ఉద్యోగులను తీసేశాయి. వందలాది సంస్థలు ఉద్యోగాలను లేఆఫ్స్ చేశాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్ నడుస్తున్నది. ముఖ్యంగా టెక్ కంపెనీలు ఎక్కువగా ఉద్యోగులను తీసేస్తున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- layoffs
- Meta
- Meta layoffs
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

