అత్యవసర మందులకూ తీవ్ర కొరత
కొలంబో, మే 23: శ్రీలంకలో వైద్య వ్యవస్థ కుప్పకూలుతున్నది. దేశానికి కావాల్సిన మందుల్లో దాదాపు 80 శాతం దిగుమతుల ద్వా రానే లభ్యమయ్యేవి. అయి తే విదేశీ మారక ద్రవ్యం నిల్వలు భారీగా పడిపోవడంతో దిగుమతి చేసుకునే పరిస్థితులు లేవు. దీంతో అత్యవసర మందులు దొరకట్లేదు.
మందులు లేకపోవడంతో అత్యవసర శస్త్రచికిత్సలు కూడా చేయలేకపోతున్నామని వైద్యులు చెబుతున్నారు. దేశంలో చాలా మంది రోగుల ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, త్వరితగతిన ఈ సమస్యను తీర్చకపోతే రోగులకు మరణ శాసనం రాసినట్టే అవుతుందని హెచ్చరిస్తున్నారు.