కాలిఫోర్నియా: చాట్‌జీపీటీ తయారీ సంస్థ ఓపెన్ఏఐతో పాటు ఆ సంస్థ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్‌పై దాఖలు చేసిన దావాను బిలియనీర్ మస్క్(Elon Musk) వెనక్కి తీసుకున్నారు. కేసును విత్‌డ్రా చేస్తున్న విషయాన్ని కాలిఫోర్నియా కోర్టులో మస్క్ న్యాయవాదులు తెలిపారు. మస్క్ తరపున వాదించిన అటార్నీలు.. ఆ దావాను కొట్టిపారేయాలని కోర్టును కోరారు. ఫిబ్రవరిలో ఆ దావాను దాఖలు చేశారు. శాన్ఫ్రాన్సిస్కో కోర్టులో దావా రద్దుకు చెందిన ఫైలింగ్ నమోదు చేశారు. మానవాళి ఉపయోగం కోసం కృత్రిమ మేథను డెవలప్ చేయాలని, లాభాల కోసం కాదన్న అంశంపై ఆల్ట్‌మాన్‌పై మస్క్ దావాను దాఖలు చేశారు. అయితే చాట్‌జీపీటీ డెవలప్ చేసిన ఓపెన్ ఏఐతో పాటు ఆల్ట్‌మాన్‌పై కేసును విత్‌డ్రా చేసుకుంటున్నట్లు మస్క్ న్యాయవాదులు తెలిపారు.
చాట్‌జీపీటీ కోసం ఓపెన్ఏఐతో యాపిల్ జట్టుకట్టడాన్ని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తప్పుబట్టారు. ఇది భద్రతా ఉల్లంఘన అని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఆపరేటింగ్ సిస్టమ్ స్థాయిలో చాట్‌జీపీటీని అనుసంధానం చేస్తే తమ సంస్థల్లో యాపిల్ గాడ్జెట్లను నిషేధిస్తామని హెచ్చరించారు.చాట్‌జీపీటీని ఉచితంగా వినియోగించుకోవచ్చని యాపిల్ తెలిపింది. ఐఓఎస్18లో కాల్ రికార్డింగ్, ట్రాన్స్క్రైబ్ ఆప్షన్లు తేనున్నట్టు తెలిపింది. యూజర్లు ఇక కాల్స్‌ను రికార్డు చేయవచ్చని, కాల్ రికార్డు అవుతున్నట్టు అవతలి వారికి నోటిఫికేషన్ వెళ్తుందని తెలిపింది.