Elon Musk | ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్‌ను(Twitter) హస్తగతం చేసుకున్నారు. 44 బిలియన్ యూఎస్ డాలర్లతో తన చేతిలోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ట్విట్టర్ తన చేతికి వచ్చిన తర్వాత ఆయన ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘పక్షికి విముక్తి కలిగింది’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
అయితే ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న గంటల వ్యవధిలోనే మస్క్.. సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్‌ను తొలగించారు. వీరితోపాటు లీగల్ పాలసీ, ట్రస్ట్ అండ్ సేఫ్టీ హెడ్‌పై వేటు వేసినట్లు సమాచారం. కాగా, ట్విట్టర్ తన చేతికి వచ్చిన తర్వాత ఉద్యోగులను భారీగా తొలగిస్తారంటూ వస్తున్న వార్తలపై మస్క్ ఇప్పటికే స్పందించారు. 75 శాతం ఉద్యోగులను తాను తొలగించబోనని స్పష్టం చేశారు.
the bird is freed
— Elon Musk (@elonmusk) October 28, 2022