న్యూయార్క్: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచిన ఎలన్ మస్క్ ఈ ఏడాది పన్నుల రూపంలో సుమారు 11 బిలియన్ల డాలర్లు చెల్లించనున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మస్క్ ఎంత ట్యాక్స్ కడుతారన్న అంశంపై ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ సేనేటర్ ఎలిజబెత్ వారెన్ ఓ ట్వీట్లో మస్క్ వైఖరిని ఖండించారు. పన్ను ఎగవేతను మస్క్ ప్రోత్సహించరాదన్న రీతిలో ఆ సేనేటర్ ఓ ట్వీట్ చేశారు. దానికి ఎలన్ మస్క్ కౌంటర్ ఇస్తూ.. ఆశ్చర్యపడేవాళ్లకు ఓ విషయం చెబుతున్నానని, ఈ ఏడాది 11 బిలియన్ల డాలర్లు పన్ను రూపంలో కట్టనున్నట్లు తెలిపారు. ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా, స్పేస్ ఎక్స్‌తో దండిగా సందపాదిస్తున్న ఎలన్ మస్క్ ప్రపంచంలోనే ఈ యేటి సంపన్న వ్యక్తిగా నిలిచారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ల జాబితా ప్రకారం ఆయన ఆస్తులు 243 బిలియన్ల డాలర్లు. దాంట్లో టెస్లా విలువ ట్రిలియన్ డాలర్ కాగా, స్పేస్ ఎక్స్ విలువ సుమారు 100 బిలియన్ల డాలర్లు. టైమ్ మ్యాగ్జిన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గత వారమే మస్క్‌ను వరించింది.
For those wondering, I will pay over $11 billion in taxes this year
— Elon Musk (@elonmusk) December 20, 2021