Elon Musk | 7 ఏళ్ల తర్వాత తండ్రిని కలుసుకున్న ఎలాన్ మస్క్
Elon Musk | అమెరికన్ బిజినెస్ టైకూన్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) చాలా ఏళ్ల తర్వాత తన తండ్రిని కలుసుకున్నాడట (Meets Father).
Elon Musk | అమెరికన్ బిజినెస్ టైకూన్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (ఎక్స్)ను కొనుగోలు చేసినప్పటి నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఏం చేసినా సంచలనంగానే మారుతోంది. ఈ క్రమంలో మస్క్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. మస్క్ చాలా ఏళ్ల తర్వాత తన తండ్రిని కలుసుకున్నాడట (Meets Father).
ఎలాన్ మస్క్‌కు తన తండ్రి ఎరోల్ మస్క్ (Errol Musk)తో విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. తండ్రంటే మస్క్‌కు ఇష్టం ఉండదు. ‘మా నాన్న దుర్మార్గానికి ప్రతిరూపం. ఒక మనిషి ఎంత దారుణానికి ఒడిగట్టగలడో, అంతా తను చేయగలడు’ అని ఓ సందర్భంలో మస్క్ భారంగా వెల్లడించాడు. అయితే, చాలా ఏళ్ల తర్వాత తాజాగా మస్క్ తన తండ్రిని కలుసుకోవడం విశేషం. టెక్సాస్ (Texas)లోని బోకా చికా (Boca Chica)లో మస్క్ తన తండ్రిని కలుసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. దాదాపు ఏడేళ్ల తర్వాత మస్క్ తన తండ్రి ఎరోల్ మస్క్‌ను కలుసుకోవడం ఇదే మొదటిసారని తెలిపింది.
చివరిసారిగా మస్క్ తన తండ్రిని 2016లో కలుసుకున్నట్లు తెలిపింది. మరోవైపు తండ్రీ కొడుకులు చాలా ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ మీట్లో ఇద్దరూ తమ సమయాన్ని సరదాగా గడిపినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని లంచ్ చేసినట్లు వివరించింది.
Also Read..
Snake | గదిలోకి పామును వదిలి.. భార్య, రెండేళ్ల కుమార్తెను చంపిన వ్యక్తి
Raj Kumar Kohli | చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సినీ నిర్మాత మృతి
Mumbai Airport | బాంబులతో పేల్చేస్తామంటూ.. ముంబై ఎయిర్‌పోర్ట్‌కు బెదిరింపులు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

