మాలి : పశ్చిమాఫ్రికాలోని సెంట్రల్ మాలిలో ఓ బస్సులో పేలుడు సంభవించడంతో 11 మంది మరణించగా 53 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు.
బండియగర, గుండక మధ్య బస్ ప్రయాణిస్తుండగా మోప్తి ప్రాంతంలో పేలుడు పదార్ధాన్ని బస్ ఢీ కొనడంతో ఈ ఘటన జరిగింది. చాలాకాలంగా ఈ ప్రాంతంలో జిహాదీ ఉగ్రవాదులు హింసాకాండతో విధ్వంసానికి పూనుకుంటున్నారు.
పేలుడు ఘటనలో గాయపడిన వారంతా పౌరులేనని అధికారులు వెల్లడించారు. జిహాదీ ఉగ్రవాదం మాలిలో వేలాది మందిని బలితీసుకోగా వందలాది మంది తమ స్వస్ధలాలకు దూరం కావాల్సి వచ్చింది.