Ecuador: ఎన్నికల ర్యాలీలో ఈక్వెడార్ దేశాధ్యక్ష అభ్యర్ధి కాల్చివేత
Fernando Villavicencio: ఈక్వెడార్ దేశాధ్యక్ష ఎన్నికల ఆగస్టు 20వ తేదీన నిర్వహించనున్నారు. అయితే ఆ ఎన్నికల్లో అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఫెర్నాండో విల్లవిసెన్సియోను ఓ ర్యాలీలో కాల్చి చంపారు. ఎన్నికల అంచనాల్లో ఆయనే లీడింగ్‌లో ఉన్నారు. ఎవరు ఆ అటాక్‌కు పాల్పడ్డారో తెలియదు. కానీ ఓ సాయుధుడు తన వద్ద ఉన్న గన్‌తో కాల్పులు జరిపారు.
క్విటో: ఈక్వెడార్(Ecuador) దేశాధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన అభ్యర్ధిగా పోటీలో ఉన్న ఫెర్నాండో విల్లవిసెన్సియోను ఓ ఎన్నికల ర్యాలీలో కాల్చి చంపారు. క్విటో పట్టణంలో ఈ ఘటన జరిగింది. ఓ సాయుధుడు ఆయనపై కాల్పులు జరిపారు. ఆగస్టు 20వ తేదీ ఆ దేశానికి చెందిన తొలి దశ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికలకు రెండు వారాల ముందే కీలకమైన అభ్యర్ధిని హత్య చేయడం ఈక్వెడార్‌లో కలకలంగా మారింది. 59 ఏళ్ల ఫెర్నాండోపై పలుమార్లు బుల్లెట్ల వర్షం కురిపించారు. క్విటో హైస్కూల్లో జరిగిన ర్యాలీ నుంచి వెళ్తున్న సమయంలో ఈ అటాక్ జరిగింది. ఈ దాడిలో ఓ పోలీసు ఆఫీసర్ గాయపడ్డారు.
తొలుత ఫెర్నాండోపై ఆ సాయుధుడు గ్రేనేడ్ దాడి చేశారు. కానీ ఆ గ్రేనేడ్ పేలలేదు. ఈక్వెడార్ జాతీయ అసెంబ్లీలో ఫెర్నాండో సభ్యుడిగా ఉన్నారు. కానీ ఆ అసెంబ్లీని మే నెలలో రద్దు చేశారు. ఈక్వెడార్ అధ్యక్ష ఎన్నికల్లో ఆయనే లీడింగ్‌లో ఉన్నారు. ఆ దేశంలో గ్యాంగ్ వార్ ఎక్కువగా ఉంది. డ్రగ్ మాఫియా కూడా నియంత్రణలో లేదు. ఎన్నికల ప్రచారం సమయంలో.. ఈక్వెడార్‌లో జరుగుతున్న హింస గురించి ఫెర్నాడో ఫోకస్ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

