వాషింగ్టన్: ఎలక్ట్రోథెరఫీ ద్వారా గాయాన్ని వేగంగా మాన్పించే ఈ-బ్యాండేజ్‌ను అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు తయారుచేశారు. సాధారణంగా మధుమేహ బాధితుల్లో గాయాలకు చికిత్స కష్టమవుతుందని, ఇలాంటి వారికి గాయాలు, పుండ్లు మాన్పడంలో ఈ బ్యాండేజ్ సమర్థంగా పని చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. 30% వేగంగా గాయాన్ని మాన్పించవచ్చని చెప్పారు.