Dubai Rains | దుబాయ్, మే 2: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని దుబాయ్‌ని గురువారం మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో పలు ప్రాంతాలు భారీ వరద నీటితో నిండిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాల కారణంగా దుబాయ్, అబుదాబి, షార్జాలలో పలు విమాన, బస్ సర్వీసులను రద్దు చేశారు. కొన్ని విమానాలను దారి మళ్లించారు. అబుదాబిలోని చాలా వీధుల్లో వరద నీరు నిలిచిపోయింది. రాత్రి మూడు గంటల నుంచే ఉరుములు, బలమైన ఈదురుగాలులతో భారీ వాన ప్రారంభమైనట్టు దుబాయ్ మీడియా వెల్లడించింది.