దుబాయ్: దుబాయ్ కేంద్రంగా పని చేస్తున్న ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్, ఫొటోగ్రాఫర్ అనునయ్ సూద్ (32) మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఆయన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా గురువారం వెల్లడించారు.
మరణానికి కారణాలేమిటో తెలియజేయలేదు. తమ ఇంటి వద్దకు రావద్దని సూద్ ఫ్యాన్స్‌ను కోరారు. ఈ కష్ట కాలంలో తాము అనుభవిస్తున్న ఆవేదనను అర్థం చేసుకోవాలని, తమకు సంఘీభావంగా నిలవాలని, తమ కోసం ప్రార్థన చేయాలని కోరారు.