న్యూయార్క్, ఆగస్టు 18: ప్రతి మనిషికి మరణం అనేది కామన్. ఎంత గొప్పగా బతికినా.. ఆరడుగుల జాగాలోనే తనువు చాలించాలి. అలాంటిది.. చావునే చీట్ చేసి బతికేస్తే..! అదీ యవ్వనంగా కనిపించేలా జీవిస్తే..! దాన్ని సుసాధ్యం చేస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ శాస్త్రవేత్తలు ఆ దిశగా పరిశోధనలు చేపట్టారు. ల్యాబ్లో అభివృద్ధి చేసిన న్యూరోనాల్ మూల కణాలతో మెదడు కణజాలాన్ని రిపేర్ చేసి విజయవంతంగా బతికేయొచ్చని అంటున్నారు. ఎలుకల్లో చేసిన పరిశోధనలు విజయవంతం అయ్యాయని చెప్తున్నారు. మెదడు కణజాల మార్పిడి ద్వారా ఆశాజనక ఫలితాలు సాధించామని పరిశోధనలో భాగమైన డాక్టర్ హెబెర్ట్ పేర్కొన్నారు. అయితే, ఈ పరిశోధనపై పలువురు శాస్త్రవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు.