Donald Trump: న్యూ హ్యాంప్‌షైర్‌లో ట్రంప్ విక్టరీ.. రిపబ్లికన్ ప్రైమరీ ఫైట్‌లో టాప్ షో
Donald Trump: ట్రంప్ మళ్లీ ఆధిపత్యం ప్రదర్శించారు. పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో దూసుకెళ్తున్నారు. న్యూ హ్యాంప్‌షైర్‌లో జరిగిన పోటీలో ఆయన విజయం సాధించారు. రెండవ స్థానంలో నిక్కీ హేలీ నిలిచారు.
న్యూయార్క్: రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా ఈసారి కూడా పోటీ పడేందుకు అమెరికా మాజీ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే పార్టీ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న ప్రైమరీ ఎన్నికల్లో ఇప్పటికే ఓ విక్టరీ కొట్టిన ట్రంప్ ఇవాళ మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. న్యూ హ్యాంప్‌షైర్ ప్రైమరీలో ఆయన విజయకేతనం ఎగురవేశారు. దీంతో దాదాపు ఆయనకు అధ్యక్ష అభ్యర్థిగా లైన్ క్లియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
న్యూ హ్యాంప్‌షైర్‌లో ట్రంప్‌కు 55 శాతం ఓట్లు పడ్డాయి. ఇక రెండవ స్థానంలో నిక్కి హేలీ ఉంది. వారం క్రితం ఐయోవాలో జరిగిన ప్రైమరీలో కూడా ట్రంప్ నెగ్గిన విషయం తెలిసిందే. న్యూ హ్యాంప్‌షైర్‌లో 22 మంది డిలీగేట్స్ ఉండగా, దాంట్లో ట్రంప్ 11, హేలీ 8 గెలుచుకున్నట్లు సమాచారం.
రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థి రేసులో ఒకవేళ హేలీ ఉన్నా తాను పట్టించుకోబోనని ట్రంప్ అన్నారు. ఆమె ఏం చేయాలనుకున్నా చేసుకోవచ్చు అన్నారు. అయితే సౌత్ కరోలినాలో జరిగే ప్రైమరీ రేసులో మాత్రం తనదే విజయం ఉంటుందని మరో వైపు నిక్కీ హేలీ అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

