Donald Trump | రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్.. దేశంలో పెట్రో ధరలు ఇంకా పెరుగుతాయా..?
Donald Trump : ఇప్పటికే చమురు ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ప్రపంచానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాకిచ్చారు.
Donald Trump : ఇప్పటికే చమురు ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ప్రపంచానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాకిచ్చారు. ఇటీవల రష్యా చమురు కొనుగోలుపై విధించిన మినహాయింపును రద్దు చేశారు. ఇరాన్ యుద్ధం, హార్ముజ్ మూసివేత నేపథ్యంలో ఇండియా సహా వివిధ దేశాలకు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు ట్రంప్ తాత్కాలికంగా అనుమతించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మినహాయింపుపై విధించిన గడువు పూర్తైంది. అంటే, రష్యా చమురు కొనుగోలుపై ఆంక్షలు అమలవుతాయి.
ఈ మినహాయింపును పొడిగించేందుకు ట్రంప్ సర్కార్ నిరాకరించింది. ఈ నిర్ణయం వల్ల అందరికంటే ఎక్కువగా ఇబ్బంది పడే దేశం ఇండియానే. ఎందుకంటే రష్యా నుంచి ఇండియా ఎక్కువగా చమురు కొనుగోలు చేస్తుంది. అందులోనూ హార్ముజ్ జలసంధి నుంచి చమురు రవాణా భారీగా తగ్గిపోవడం, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితుల్లో ఇండియాకు రష్యా చమురు ఎంతగానో ఉపయోగపడింది. కొద్ది రోజులుగా భారీ స్థాయిలో రష్యా చమురును ఇండియా దిగుమతి చేసుకుంది. గత మార్చిలో 4.5 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ను ఇండియా కొనుగోలు చేయగా, ఇందులో సగానికిపైగా చమురు రష్యా నుంచే దిగుమతి చేసుకుంది. ఇదే సమయంలో యుద్ధం జరుగుతున్న మిడిల్ ఈస్ట్ నుంచి చమురు దిగుమతి 61 శాతం తగ్గింది.
గత ఏప్రిల్లో ఇండియాకు రష్యా అత్యధిక చమురు అందించింది. రోజుకు 1.57 మిలియన్ బ్యారెళ్ల చమురును ఇండియా దిగుమతి చేసుకుంది. ఇప్పుడు రష్యా నుంచి చమురు కొనుగోలును అమెరికా నిషేధించిన నేపథ్యంలో.. ఇండియా ఆ చమురును కొనకపోతే దేశంలో మరింత సంక్షోభం తప్పదు. ఇటీవలి కాలంలో వరుసగా పెట్రో ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. అలాంటిది రష్యా చమురు ఆగిపోతే పెట్రో బాదుడు భారీగా ఉండబోతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

