Donald Trump: అణ్వాయుధాలు వదులుకునేందుకు ఇరాన్ అంగీకరించింది: డోనాల్డ్ ట్రంప్
Donald Trump: అణ్వాయుధాలను కలిగి ఉండబోమని ఇరాన్ అంగీకరించినట్లు సోమవారం డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇక తమ శాంతి ఒప్పందంలో భాగంగా ఇరాన్‌కు 300 మిలియన్ల డాలర్ల ఇవ్వనున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ట్రంప్ తన ట్రుత్ సోషల్‌లో స్పందించారు.
న్యూయార్క్: అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. అయితే అణ్వాయుధాలను కలిగి ఉండబోమని ఇరాన్ అంగీకరించినట్లు సోమవారం డోనాల్డ్ ట్రంప్(Donald Trump) తెలిపారు. ఇక తమ శాంతి ఒప్పందంలో భాగంగా ఇరాన్‌కు 300 మిలియన్ల డాలర్ల ఇవ్వనున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ట్రంప్ తన ట్రుత్ సోషల్‌లో స్పందించారు. ఇరాన్‌తో కుదిరే డీల్‌లో.. అణ్వస్త్రాలను డెవలప్ చేయబోమని ఆ దేశం అంగీకరించనున్నట్లు ట్రంప్ చెప్పారు. ఇరాన్, అమెరికా మధ్య ఎంవోయూ కుదిరినట్లు వార్తలు వెలుబడుతున్న విషయం తెలిసిందే. జెనీవాలో శుక్రవారం అధికారికంగా రెండు దేశాల మధ్య సంతకాలు జరిగే అవకాశం ఉన్నది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదటి రోజు నుంచి స్పష్టంగా ఉన్నారని, ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండబోదని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. అణ్వాయుధ సేకరణ కోసం ఇరాన్‌కు అనుమతి ఇవ్వబోమని ఇజ్రాయల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూ కూడా స్పష్టం చేశారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండవద్దు అని దశాబ్ధాలుగా పోరాటం చేస్తున్నానని, దీన్ని జీవిత మిషన్‌గా భావించానని అన్నారు. డీల్ కుదిరినా, కుదరకపోయినా, ఇరాన్ వద్ద న్యూక్లియర్ వెపన్ ఉండబోదన్నారు. ఇజ్రాయెల్ ప్రధానిగా తాను ఉన్నంత కాలం ఇలా జరగబోదన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి : హాలియా ఏడీఏ సరిత
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
ACB Net | రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా చిక్కిన కీసర ఎస్సై
హౌసింగ్ ఏఈ ఉదయ్‌కిరణ్‌కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సన్మానం
కోదాడలో ఈ 11 నుండి 17 వరకు ఉచిత నేత్ర శిబిరం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

