President Trump: పెళ్లి చేసుకున్న జూనియర్ ట్రంప్ .. సెలబ్రేషన్స్‌కు అమెరికా అధ్యక్షుడు దూరం
President Trump: ప్రెసిడెంట్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ పెళ్లి చేసుకున్నారు. మోడల్ బెట్టినా అండర్సన్‌ను అతను పెళ్లాడాడు. పామ్ బీచ్ కౌంటీలో ఆ వెంట్ జరిగింది. ఇక వెడ్డింగ్ సెలబ్రేషన్స్ బహమాస్‌లో జరగనున్నాయి. అయితే ఆ వేడుకలకు హాజరుకావడం లేదని ప్రెసిడెంట్ ట్రంప్ పేర్కొన్నారు.
ఫ్లోరిడా: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(President Trump) పెద్ద కుమారుడు డోనాల్డ్ ట్రంప్ జూనియర్ గురువారం ఫ్లోరిడాలోని ఫామ్ బీచ్‌లో పెళ్లి చేసుకున్నారు. మోడల్ బెట్టినా అండర్సన్ అనే మహిళను జూనియర్ ట్రంప్ పెళ్లాడినట్లు పామ్ బీచ్ కౌంటీ రికార్డులు పేర్కొన్నాయి. అయితే ఈ వేడుకకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హాజరుకాలేదు. ఇక వెడ్డింగ్ వేడుకలకు కూడా హాజరుకావడం లేదని ట్రంప్ తెలిపారు. బహమాస్‌లో శనివారం పెళ్లి విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ వేడుకలో తాను పాల్గొనడం లేదని ట్రంప్ చెప్పారు. సమయం తనకు అనుకూలంగా లేదన్న ట్రంప్.. ఇరాన్ యుద్ధంపై ఫోకస్ చేయాల్సిన సందర్భం వచ్చిందన్నారు. దేశాధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సిన సమయం వచ్చిందని, దాని వల్ల తన కుమారుడి పెళ్లికి హాజరుకాలేకపోయినట్లు ఆయన చెప్పారు. వైట్‌హౌజ్‌లోనే ఉంటున్నట్లు తెలిపారు. అయితే ట్రుత్ సోషల్ అకౌంట్ ద్వారా తన కుమారుడికి పెళ్లి శుభాకాంక్షలు చెప్పారు.
ట్రంప్ జూనియర్ వయసు 48 ఏల్లు. డిసెంబర్లో అండర్సన్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆయనకు ఇది రెండో పెళ్లి. మొదటి భార్య వనెసా ట్రంప్. ఆ ఇద్దరికీ అయిదుగురు పిల్లలు ఉన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

