న్యూయార్క్: మీకు గూగుల్ అకౌంట్ ఉందా? పాస్‌వర్డ్‌ను మర్చిపోతున్నారా? లాగిన్ చేసేందుకు కష్టపడుతున్నారా? అయితే ఇకపై మీ అవస్థలు తీరనున్నాయి. పాస్కీ పేరిట గూగుల్ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నది. పాస్‌వర్డ్‌ల స్థానంలో వీటిని వాడుకోవచ్చు.
పాస్వర్డ్ మర్చిపోయినా లాగిన్ అవ్వొచ్చు. పాస్కీ అనేది ఒక యూనిక్ డిజిటల్ కీ. గూగుల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి దీన్ని ఎనెబుల్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్. వీటిని హ్యాకింగ్ చేయడం అసాధ్యమని గూగుల్ తెలిపింది. యాపిల్ కంపెనీ ఈ ఫీచర్‌ను తన కస్టమర్లకు గతంలోనే అందుబాటులోకి తీసుకొచ్చింది.